Posted on మార్చి 21, 2013
17
మొల్లలు
ఓరి!నాయనో!
ఒక పాతికేళ్ళమ్మాయి ఓ కుర్రాణ్ణి చెయ్యిపట్టుకుని, బరబరా, బిరబిరా పోలీస్ స్టేషన్ కి లాక్కొచ్చింది. రాత్రి నుంచి ఉద్యోగం చేస్తున్న
ఎస్.ఐ: ఏంటమ్మా ఏంటి సంగతి అన్నాడు. ( ఈయన సత్తెకాలపు పోలీసులెండి. లేకపోతే ఏటే నం(లం)… కానా ఎవణ్ణే, పొద్దుగాల లేపుకొచ్చినావు అని ఉండేవాడు.)
అమ్మాయి: ఈయన నా కేసి నోరొదిలేసి చూస్తున్నాడు. చొంగ కార్చుకుంటున్నాడు. అందం వర్ణించేస్తున్నాడు, కేసెట్టి లోపలేసెయ్యండి.
పోలీస్; ( కుర్రాడితో) ఓరి పిచ్చినాయాల! అలా తినేసేలా చూస్తారా? తప్పుకదూ! దొంగ చూపుల్చూడాలి కాని, పారిపోక, ఈ అమ్మాయి చెయ్యట్టుకుని లాక్కొస్తే వచ్చేసేవా?
కుర్రాడు: ఏం చెయ్యనండి! లాక్కొచ్చేసింది వచ్చేసేనండి.
పోలీస్: ఎప్పుడు చూసేడు? ఎక్కడ చూసేడు?. సాక్షాలేవమ్మాయి?
అమ్మాయి: సాక్షాలెక్కడుంటాయి? నాకేసి మిర్రి మిర్రి చూశాడు, నీ ముక్కు అందంగా సంపెంగ పువ్వులా, పెదవులు తమలపాకుల్లా, పలువరుస ముత్యాలలా, ముఖం పద్మంలా, మెడ శంఖంలా అని ఇంకా కింద,కింద వర్ణించేస్తున్నాడండీ!పద్దూ! నీ అందమే అందం! హాయ్ రాణీ, నా హృదయరాణీ అంటున్నాడండీ.
పోలీస్: సాక్ష్యాలు లేకుండా కేస్ కట్టవమ్మాయ్.
అమ్మాయ్: సాక్ష్యాలెక్కడుంటాయ్, మా పడకగదిలో అంటే!
పోలీస్: నీ పడక గదిలోకెలా వచ్చాడమ్మా?
అమ్మాయి: ఏడిచినట్లుంది, నా పడకగదిలో, నా మొగుడు కాక మరొకరు ఎలా ఉంటారు?
పోలీస్: ఓరినాయనో! రేపటినుంచి ఈ కేస్ లు కూడా చూడాలా?
(Starring at a lady/girl is punishable under new act)
కాదూ మరి మొల్లలంటు మొత్త ఊరుకుంటామా !
ఓర్నాయనో ! జిలేబుల
ధర్నా చూడండ్రి ! చూపు తచ్చా డగనన్
మర్నాడే పోలీసుల
చర్నా కోల చమడాలు చక్కగ వొలుచున్ 🙂
జిలేబి
మెచ్చుకోండిమెచ్చుకోండి
Zilebiగారు,
మొల్ల వాసనలేని పువ్వు 🙂
మొల్ల అంటేనే మొత్తుతారా? 🙂
ధన్యవాదాలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
ఓరి నాయనో ! టేస్టు లేనోడి తోడ
నెట్లు పడక పంచు కునేదిరో ! పు
లీసు బాబాయి ! గట్టిగా కేసు బెట్టి
బొక్కలో తోయి వీడిని బొక్క లిరగ .
మెచ్చుకోండిమెచ్చుకోండి
వెంకట రాజారావు . లక్కాకులగారు,
రోజులిలా ఉన్నమాట నిజం 🙂
ధన్యవాదాలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి