శర్మ కాలక్షేపంకబుర్లు-చెదల పర్వం

Posted on ఏప్రిల్ 10, 2012
6
చెదల పర్వం part-2

మార్చి నెల రెండవతారీకు, స్నేహితులు ఫణి బాబుగారు చెల్లాయిని తీసుకుని వస్తున్నాను అని చెబుతుండగా నా ఇల్లాలు వచ్చింది నా దగ్గరకి, ఆహా! ఏమి నా భాగ్యము, ఆడబోయిన తీర్థం ఎదురొచ్చిందే అనుకుంటూ, ఆవిడకి వివరాలు చెప్పి “ఏర్పాట్లు చూసుకో” అన్నాను. “సరే! దానికి మీరు కంగారు పడక్కరలేదు, మీకో శుభవార్త” అంది. ఏంటబ్బా అనుకుంటూ ఉండగా చెయ్యి పట్టుకుని తీసుకు వెళ్ళింది, “రండి” అంటూ. సూదిలో దారం బొంతకి అలంకారమని కూడా వెళ్ళేను. వీధి గుమ్మం దగ్గరకి తీసుకెళ్ళింది,చూస్తే ఏముంది గుమ్మం కిందికి దిగిపోయి తలుపు జారిపోయింది. నా ఇల్లాలు” మనం ఇల్లు కట్టి దగ్గరగా పాతికేళ్ళు అయింది. ఆ సంవత్సరమే అద్దెకిచ్చేసి, దేశం మీద పడ్డాము కదా, అప్పటినుంచి దీని ఆలనా పాలనా చూసిన నాధుడు లేడు. అంచేత చెదలు నెమ్మది నెమ్మదిగా తింటున్నాయి. అవసరం వచ్చి నపుడల్లా గడపలు తీసేసి, సిమెంటు గడపలు వేస్తూ వచ్చాము. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా మారిపోయింది. ఏదో ఒకటి చేయ్యాలి” అంది. ముందు సరి చేదామని ఇద్దరమూ పట్టి సరి చేసి, సాయంత్రం ఈ విషయం మీద మాట్లాడు కుందామని వాయిదా వేశాము. ఆ రోజు సాయంత్రం మొత్తం ఇల్లు పరిశీలిస్తే, ఇంటినుంచి బయటికి వెళ్ళే గుమ్మాలన్నీ బాగోలేనట్లుగా తెలిసింది. “ఆ రోజులలో పెస్ట్ కంట్రోళ్ళు లేవు, మనం లేము, చాలా కారణాలు ఉన్నాయి, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి” అంది. ముందు వడ్రం మేస్త్రిని పిలిచేము. షరా మామూలే వస్తున్నా. పత్తా లేడు. అవసరం మనది కదా వాడి దగ్గరకెళ్ళి బతిమాలి తీసుకొచ్చి చూపిస్తే “గుమ్మాలు మార్చుకోవాలండి” అన్నాడు. “అది సరే నయ్యా ఎలా అంటే, పాత గుమ్మాలే బాగు చెయ్యాలంటే కష్టం. గుమ్మాలు తియ్యాలి, బాగు చెయ్యాలి పెట్టాలి. తాపీ మేస్త్రీ కూడా ఉంటే గాని పని అవదండీ సమయం పడుతుంది. కొత్తవి చేయించుకుంటే పాతవి తీసేసి కొత్తవి పెట్టుకుంటె తొందరగా అవుతుందని” శలవిచ్చాడు. ఎంతవుతుందంటే ఒక్కో గుమ్మం కి మూడు వేలు దాకా కావచ్చన్నాడు. మళ్ళీ చెదలంటే, పరిస్థితి ఏమిటన్నా. అవి మామూలేనండి. పెస్ట్ కొట్టించాలండి, ప్రతి రెండేళ్ళకి, లేక పోతే బాధలు తప్పవండి అన్నాడు. “సిమెంటు గుమ్మాలు పెడుతున్నారు కదా” అన్నా. “నిజమేకాని పోయించుకోవాలి” అన్నాడు. “కాదయ్యా! మన ఊళ్ళో ఫలనా చోట సిమెంటు గుమ్మాలు పోశాడు చూసాను. ఈ గుమ్మాల కొలతలకి సరిగా సరిపోయాయి, మనకి కావలసిన ఆరు గుమ్మాలున్నాయి అతని దగ్గర” అన్నా. “నా ఉద్దేశం అయితే అవి పెట్టద్దండి. ఆ గుమ్మాలు రెండేళ్ళకే పోతాయి. ఆ తరవాత నన్ను అనుకుని ఉపయోగం లే”దన్నాడు. “సరే వాడినే మనకి కావలసినట్లుగా పోయమందాము, మన ఇంటి దగ్గర” అనుకున్నాము. వెళ్ళి అడిగేను. “కావాలంటే మీకు పోసి పెడతాము తప్పించి, మీదగ్గరకొచ్చి పొయ్యం”అన్నాడు. ఎలా! మార్గం. తాపీ మేస్త్రీని పిలిచి అడిగితే! “మీరు గుమ్మాలు పోయించుకుంటే పెడతాను తప్పించి, పోసే ఖాళీ లే”దన్నాడు. నిజమే వాళ్ళపని అలా ఉంది. మ పల్లెటూరిలో ఇప్పటికి దగ్గరగా నలభై అపార్ట్మెంటు కాంప్లెక్స్ లున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఒక పదేనా నిర్మాణం లో ఉన్నాయి. ఎవరికీ ఖాళీ లేదు. ఎలా అని అలోచిస్తూ ఉండగా మా చిన్న కోడలు నాన్న గారు “ఎలా వున్నారని” ఫోన్ లో పలకరిస్తే విషయం చెప్పేను. “నేను మనుషుల్ని తీసుకొచ్చి పోయిస్తా” అని హామీ ఇచ్చి ఫలానా సామాన్లు తెచ్చుకోండి అని చెప్పేరు, మేస్త్రీని దగ్గర పెట్టుకు మాటాడుతూ. “అతను చెబుతున్న సామాను ఒక గుమ్మనికా ఆరు గుమ్మాలకా” అని అడిగితే “ఆరు గుమ్మాలకేను” అని చెప్పేడు. నాకు అనుమానం పీకుతూనే ఉంది. సరే సామాను తెప్పించి చెప్పేను. మనుషులొచ్చారు. కొలతలు తీసుకుని ఇనుముతో బుట్టలు కడుతూ, “ఇనుము కావాలి”అన్నాడు. “ఏమయ్యా! మొన్న ఫోన్ లో అడిగితే సరిపోతుంది అన్నావు కదా అంటే, సామాను తెప్పించండి”అన్నాడు. సరే మళ్ళీ తెప్పించాము. ఈలోగా వడ్రం మేస్త్రీని పిలిచాము. అతనొచ్చి గుమ్మాలు పోసే అతనితో మాట్లాడి ఒక అంగుళం పెంచిపొయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడట. ఇతను ఉన్న కొలతలకి ఒక అంగుళం పెంచి గుమ్మాలు పోశాడు. బాగా వచ్చాయి. గట్టిగానూ ఉన్నాయి రేపటి నుంచి నీళ్ళు పోయండని చెప్పి ఆరు గుమ్మాలు పోయడానికి మూడు వేలు పట్టుకుపోయాడు. నీళ్ళు పోసి తడిపాము. వారం తరవాత తాపీ మేస్త్రీని పిలిస్తే అతను చెప్పిన ప్రకారం, వచ్చి చూసి నీళ్ళు తీసేసి ఆరనివ్వండి, రెండవ తారీఖు దశమి, నవమి పండగ తరవాత, మరునాడు పని మొదలేడదామని చెప్పి పోయాడు.
మిగతా రేపు

ప్రకటనలు

రచయిత: kastephale

A retired telecom engineer.

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-చెదల పర్వం”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s