శర్మ కాలక్షేపంకబుర్లు-దశావతారీ(మరుగునపడిన మన ఆట.)

శర్మ కాలక్షేపంకబుర్లు-ఈ ఆట గురించి ఎవరికైనా తెలుసా ?

ఈ ఆట గురించి ఎవరికైనా తెలుసా?

“దశావతారి” అనే ఆట పేక మన దేశంలో కి రాక ముందునుంచి ఆడుకుంటున్న ఆటగా తలుస్తాను.ఈ ఆట ప్రస్తావన శ్రీ శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి “ప్రత్యక్షశయ్య” కధ లో ఉన్నది. ఈ ఆట, అరవై సంవత్సరాల కితం, గ్రామాలలో అరుగులపై కూచుని ఆడుకోవడం నేను ఎరుగుదును. ఈ ఆటలో పేకని దస్త్రం అని అంటారు. ఈ ఆటలో ఉపయోగించే కొన్ని పదాలు, తురుఫు, కోత, పట్టు, మయిరు,ఓకు,హెచ్చు, తగ్గు, పిల్లేడు ( జొకర్ అనుకుంటా) ఇంకా కొన్ని మాటలున్నయి, నేను మరిచాను. ఒక దస్త్రంలో, అవతారాలు మత్స్య, కూర్మ, వరాహ, నారశింహ, వామన, బలరామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి, పది అవతారాలకి,ఒక్కొక అవతారానికి పది ముక్కల చొప్పున పది అవతారాలకి మొత్తం వంద ముక్కలు, పిల్లేళ్ళు ( జోకర్ లనుకుంటా). కొన్ని దస్త్రాలు కలిపి పది మందిదాకా అడేవారు. ఈ ఆట ఖాళీ సమయాలలో స్త్రీలు కూడా అడేవారు.

నాకు తెలిసినంతవరకు చెబుతున్నాను. తెలిసినవారు చెప్పండి,తెలియక పోయినా ఫర్వాలేదు మాటకలపండి.

20 THOUGHTS ON “శర్మ కాలక్షేపంకబుర్లు-ఈ ఆట గురించి ఎవరికైనా తెలుసా ?”

  • Rate This

   @జిలేబి గారు,
   ఎండ వేడిమి చాలా బాధ పెడుతోంది. వేడిమి 50 డిగ్రీలకి చేరుతోంది. కరంటు లేక చెయ్యగలది లేక, టపా రాయలేమా అని ఆలోచిస్తే చిన్నదిగా ఈ విషయం దొరికి రాశానన్నమాట.ఈ ఆట మన సంస్కృతికి పట్టుకొమ్మ. జ్ఞాపక శక్తికి, లెక్కలకి మంచి ఎక్సర్సైజ్. ఇది మరుగునపడిందని నా బాధ.
   ధన్యవాదాలు.

 1. Rate This

  శ్రీ శర్మగారికి నమస్కారం!

  మఱుగునపడిపోయిన తెలుగు ఇళ్ళలోని మంచి ఆటను జ్ఞాపకానికి తెచ్చి పుణ్యం మూటగట్టుకొన్నారు.

  శ్రీ రసజ్ఞ గారు పేర్కొన్న పేకముక్కల ఆట “తురుఫు” (< Trump; < తుర్ఫ్) ) ఉర్దూ పదం. ఆంగ్లేయులతోడి పరిచయం వల్ల ఆ ఆట మనదేశంలోకి వచ్చింది. గురజాడ వారు కన్యాశుల్కంలో ఆ ఆటను ఎంత సరసంగా ఆడవచ్చునో – ఆటలోని మోసాలతో సహా కన్నులకు కట్టి చూపారు.

  “దశావతారీ” ఆటకు “పేక” (< Pack of Cards) ముక్కలతో సంబంధం లేదు. ఆ ముక్కలు గుండ్రంగానూ, కొంత Oval గానూ ఉంటాయి. ఆ దశావతారీ ముక్కలను కట్టి ఉంచటానికి వాడే “దస్తార్” (అందమైన రంగు గుడ్డ) మూలాన దానికి “దస్త్రం” అని పేరు వచ్చింది.

  1932లో రాజమండ్రి నుంచి శ్రీ కందుకూరి బాల సూర్యప్రసాదరాయ భూపాలుడు గారు వెలువరించిన అద్భుతమైన విజ్ఞానసర్వస్వం ” ఆంధ్ర విజ్ఞానము” 3-వ సంపుటం 1448 వ పుటలో దశావతారీ ఆడే విధానం; ఆ క్రీడా పరిభాష; కొంతవఱకు చరిత్ర ఉన్నాయి.

  ఉషగారు పేర్కొన్న శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వ్యాసంలోని “దశావతారీ” వారింటనే పూర్తి కట్ట ఉండేది. దానిని అధికరించి శ్రీ పిలకా గణపతిశాస్త్రి గారొక పద్యం కూడా చెప్పారు. ఆ దస్త్రం ఇప్పటికీ వారింట ఉన్నదో లేదో – శ్రీ బుజ్జాయి గారిని అడిగి తెలుసుకోవాలి.

  సర్వ శుభాకాంక్షలతో,
  ఏల్చూరి మురళీధరరావు

  • Rate This

   @ఏల్చూరి మురళీధరరావు గారు,
   నా బ్లాగుకు స్వాగతం. అనివార్య కారణాల మూలంగా జవాబు ఆలస్యం అయింది.మరుగున పడిపోయిన ఆటని మళ్ళీ పరిచయం చెయ్యాలని కోరిక. మాకు ఇక్కడ పుస్తకాలు దొరకవు, రిఫరెన్స్ కి. ప్రయత్నం చేస్తాను. ఎవరైనా వారి బ్లాగులో దీని గురించి రాసినా నాకు సంతోషమే. సెర్చ్ లో కెళితే నా బ్లాగు చూపుతోంది తప్ప వేరు వివరం లేదు. అదీ నా బాధ.
   ధన్యవాదాలు.

 2. Rate This

  Details at http://groups.yahoo.com/group/racchabanda/message/8971
  http://groups.yahoo.com/group/racchabanda/message/8960

  భారతి రజతోత్సవసంచిక (1924-49)లో తోలుమీదచిత్రించిన చీట్ల బొమ్మలు,పెద్దాపురంరాజుగారి చిత్రసంగ్రహమునుంచి, ప్రచురించారు.

  నమస్కారములతో,
  వాడపల్లి శేషతల్పశాయి.

  • Rate This

   @వాడపల్లి శేషతల్పశాయి గారు,
   నా బ్లాగుకు స్వాగతం. అనివార్య కారణాల మూలంగా జవాబు ఆలస్యం అయింది. తెలియనిది చాలానే చెప్పేరు.
   ధన్యవాదాలు.

 3. Rate This

  తాతగారూ
  నాకు ఈ దస్త్రం అంటే తెలియదు కానీ తురఫు అయితే మా బాగా తెలుసు. ఇందులో 7 నుండి ఆసు వరకు ఉన్న ముక్కలు మాత్రమే ఆడటానికి వాడతారు. ఒక పేక సెట్టుతో ముగ్గురే ఆడతారు. అలా ఆడుకోవడానికి మిగిలిన 32 ముక్కల్లో ముందు అయిదు అయిదు పంచుతారు. పంచేవారి కుడి పక్కన ఉన్నవారు వారికి వచ్చిన ముక్కల్లో ఎక్కువ పట్లు దేనికి వస్తాయి అన్నది ఆలోచించుకుని ఒక చుక్క (డైమండ్, ఆటీన్, ఇలా) తురఫు అని చెప్తారు. ఒకవేళ వేసిన మొదటి అయిదు ముక్కల్లో అన్నీ అంకెల ముక్కలే వచ్చి బొమ్మల ముక్కలు (జాకీ, రాణీ, రాజు, ఆసు) రాకపోతే బొమ్మల లాంతరు అని ఆట కలిపేస్తారు. ఒకవేళ ఆ మొదటి అయిదు ముక్కల్లో వచ్చిన వాటిని వాళ్ళు తేల్చుకోలేకపోతే తరువాత వెయ్యబోయే ముక్క చూపించమంటారు. అప్పుడు అది ఏ చుక్కయితే అదే తురఫు గా చెప్పాలి. ఇలా తురఫు చెప్పిన వారికి అయిదు పట్లు, ముక్కలు పంచిన వారికి రెండు పట్లు, మూడవ వారికి మూడు పట్లు రావాలి. తురఫు చెప్పిన వ్యక్తి చెప్పిన చుక్క ముక్కలు పంచిన వ్యక్తి వద్ద తప్పని సరిగా ఉండాలి లేదా ఆట కలిపేస్తారు. ఇలా మొదటి అయిదు పంచి తురఫుని ఎన్నుకున్నాక మూడు మూడు ముక్కలు పంచుతారు. ఆ తరువాత రెండు రెండు ముక్కలు పంచుతారు. చివరలో మిగిలిన రెండు ముక్కలనీ అందరికీ చూపిస్తూ తురఫు చెప్పిన వ్యక్తికి ఇచ్చేస్తారు. అతను తన వద్ద ఉన్న పన్నెండు ముక్కలలో రెండు ముక్కలని దిన్చేసుకోవాలి వీటిని దింపుడు ముక్కలు అంటారు. ఈ ముక్కలు దించకుండా ఆట మొదలు పెట్టినా, చివరాఖరిన ముక్కలతో కలపకపోయినా తనతో ఆడే ఇద్దరిలో ఒకరికి ఎర్రాసు (డయమండ్ లేదా ఆటీన్) ఒకరికి నల్లాసు (కళావరు లేదా ఇస్ఫేటు) ఇవ్వాలి. తురఫు చెప్పిన వారు ఆట మొదలుపెడతారు. ఆట విషయానికి వస్తే ఏ చుక్క ముక్కతో అయితే ఆట మొదలెట్టారో ఆ చుక్కలో పెద్ద ముక్క వేస్తే ఆ పట్టు వారిది. ఒకళ్ళు ఏడుతో మొదలెడితే తరువాతి వారు రాజు వేసి తరువాతి వారు ఆసు వేస్తే ఆ పట్టు ఆసు వేసిన వారిది. ఆటీన్ తురఫు చెప్పారనుకుందాం. ఆట రాజు ఇస్ఫేటుతో మొదలయ్య్యిన్దనుకుందాం. పక్క వ్యక్తి ఆసు ఇస్ఫేటు వేస్తే ఆ పట్టు అతనికే వెళ్ళాలి కానీ మూడవ వ్యక్తి వద్ద ఇస్ఫేటు ముక్కలు లేని పక్షంలో ఏడు ఆటీన్ ముక్క వేస్తే పట్టు అతనికే వెళిపోతుంది. దీనినే కోత అంటారు. ఒక్కోసారి ఈ కోతకి పైకోత కూడా కోస్తారు. అదెలా అంటే ఆట మొదట్లో ఇస్ఫేటు ఆసు వేసారనుకోండి, ఆ ఇస్ఫేటు ముక్కలు వేరే ఇద్దరి వద్ద లేని పక్షంలో ఒకతను జాకీ ఆటీను తో కోత కోసాడనుకోండి. ఆ మూడవ వ్యక్తి రాజు ఆటీను వేస్తే పై కోత కనుక పట్టు అతనిది. ఇలా పట్టు తీసుకున్న వారు తరువాతి పట్టుకి ముక్కలు వేస్తారు. ఓడిపోయిన వారు ఎన్ని పట్లు కోల్పోయారో అన్నీ డబ్బులు (పట్టుకింత) గెలిచిన వారికి ఇవ్వాలి. ఇందులో ప్రతీ ముక్కనీ ఓకు అంటారు. భలే సరదాగా ఉంటున్దిలెండి. మీ టపా కన్నా నా వ్యాఖ్య పెద్దదయ్యింది మన్నించండి.

  •  Rate This

   @అమ్మాయ్ రసజ్ఞ,
   నాకు పేకాట రాదు.మంచి ఆటే నేర్చుకున్నా.
   మనదైన, భారతీయమైన ఆట దశావతారి. ఇది మరుగునపడిపోయిందని నా బాధ. దీన్ని మళ్ళీ పరిచయం చెయ్యాలని ఆశ.
   ధన్యవాదాలు.

 4. Rate This

  కృష్ణశాస్త్రి సాహిత్యం – 5, వ్యాసావళి-వ్యాసాలు : పుస్తకం లో “మన ఆటలు” అన్న శీర్షికన వచ్చిన 1952 నాటి రేడియో ప్రసంగం లో (పేజీ నెం: 240) లో ఈ ‘దశావతారి’ ఆట ని గూర్చిన చాలా వివరాలున్నాయి, చదివి ఆడేంత వివరంగా కాదు గాని. దీన్ని పేకాటకి అన్నగా చెప్పిన ఆ వ్యాసం ప్రకారం అంతకు 25 ఏళ్ళ క్రితమే ఇది నిలిచిపోయినట్లుగా అర్థమైంది. ఆ పుస్తకం లో చాలా ఇతరత్రా విశేషాలున్నాయి. దొరికితే కొని చదవండి. అలాగే నేనూ శ్రీపాద వారి ‘వడ్లగింజలు’ లో ప్రస్తావన రావడం చదివాను.

  • Rate This

   @ఉషగారు,
   కొద్దిగా నిరాశ పడ్డా, మీదగ్గరనుంచి కొంత విలువైన సమాచారమే లభించింది. ఈ ఆట మా ఇంటి అరుగుపై ఆడేవారు.( 1955-1960 ) నాడి ఆడే వయసుకాదు, అప్పటికి. విపులాచ పృధ్వీ, మరెవరేనా చెప్పకపోతారా! ఆశా జీవిని, పుస్తకం ప్రయత్నం చేస్తా. నాకు తెలిసినంత వరకు ఆట క్రమం కూడా చెబుతాను, ఎక్కడా లేదు కనక. చూద్దాం, ఈ ఆట మరుగున పడి ఉండచ్చు కాని చచ్చిపోలేదనుకుంటున్నా. మీ సహకారానికి
   Thank you

 5. Rate This

  పిల్లేడ్ గురించి తెలియదు. మీరు చెప్పిన ఆటలోనే కాకుండా పల్లెటూళ్లలో పేకను దస్త్రం అని వ్యవరిస్తుంటారు ఇప్పుడు కూడా. తురుఫు, కోత, పట్టు,ఓకు,హెచ్చు, తగ్గు.. ఈ పదాలు వేరే ఆటలలో వాడటం తెలుసు. ఉదాహరణకు ఆట-అడ్డు(అడ్డాట), trump.

 6. Rate This

  ఈ ఆటగురించి వినడం కాని చూడడం కాని జరుగ లేదు, కానీ నా చిన్నప్పుడు పేకని కూడా దస్త్రం ఆని పిలవడం ఎరుగుదును. మా నాన్న గారు జోకర్ని పిల్లి అనే వారు.దీనికీ పిల్లేడు తో సంబంధం ఉన్నాదేమో?

  • Rate This

   @Gopal Krishna Rao Pantulaగారు,
   బహుశః దస్త్రం అనే మాట మన ఆటనుంచి ఇప్పటి పేకకి సంక్రమించిందనుకుంటా. జోకర్ ని పిల్లి అనడం కూడా మన ఆటనుంచి సంక్రమించి ఉండాలనుకుంటా.
   ధన్యవాదాలు

————————————————

 

Posted on ఆగస్ట్ 13, 2012

దశావతారీ.(మరుగున పడిన మన ఆట)

నేను జూన్ ఒకటవ తేదీన ఈ ఆట ఎవరికైనా తెలుసా అని ఒక టపా రాశా. అందులో దశావతారీ అనే ఆట ( పేకను పోలినది ) మన దేశంలో అందునా తెనుగునాట ఆడేవారు. దాని గురించి అడిగినపుడు, సర్వశ్రీ ఉషగారు, ఏల్చూరి మురళీధరరావు గారు, వాడపల్లి శేషతల్పశాయి గారలు కొన్ని వివరాలిచ్చేరు. శ్రీ శేషతల్పశాయిగారిచ్చిన లింక్ లో ఎక్కువ వివరాలు లేవు. నాకు ఇక్కడ పల్లెలో పుస్తకాలు దొరకవు. మన మిత్రుడు చి. శ్రీకరుడు గారు నేను హైదరాబాదునుంచి మీకు ఎవరికి ఎక్కడవున్నా, కావలసిన పుస్తకాలు కొని పంపగలను, సొమ్ము బేంకు కు జమచేయమని వారి బ్లాగులో రాస్తే నేను నాకు కావలసిన పుస్తకమేదో అడుగుతూ, ఈ వివరాలు దొరుకుతాయేమో చూడమంటే వారు ఒక పుస్తకంలోని పేజి స్కేన్ చేసి పంపేరు. ఇది శ్రీ మురళీధర రావు గారు చెప్పిన పుస్తకంలోనిది. ఎందుకింత శ్రమ అని అడగచ్చు, ఈ ఆట మన తెనుగునాట చాలా ప్రాచుర్యం లో ఉండేది, భారతీయమైన ఆట, ఎందుకు మరుగున పడిందో తెలియదు. దీని వివరాలు ఎక్కడా నెట్ లో దొరకలేదు. అందుకు ఈ తాపత్రయం. మిగిలిన వివరాలు దొరికితే మళ్ళీ టపా రాస్తాను. సర్వశ్రీ మురళీధర రావుగారికి, ఉషగారికి, శేషతల్పశాయి గారికి ధన్యవాదాలు. చిరంజీవి శ్రీ కరుడు గారికి ఆశీర్వచనాలు.

Courtesy :- http://bookforyou1nly.blogspot.in/

 1. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ప్రముఖ కథ వడ్లగింజలులో ఈ ఆట ప్రసక్తి విరివిగా కనిపిస్తుంది. దీనిలోనే రంగుబూజు, ఆదినారాయణం అనే రకాలు ఉన్నట్లుగా శాస్త్రిగారు రాశారు.

  • Rate This

   @కొత్తపాళీగారు,
   నారాయణ స్వామిగారు నా బ్లాగుకు స్వాగతం. నేను చిన్నప్పుడు ఈ ఆట ఆడుతుండగా చూసినవాడిని. ఆ తరవాత నా అభిమాన రచయిత శ్రీ పాద వారి వడ్లగింజల ద్వారా దీని గొప్పతనం తెలుసుకున్నా, అందుకే దీని గురించి వివరాలు సేకరించాలని తపన,
   ధన్యవాదాలు.

 2. Rate This

  శర్మ గారూ!
  సుబ్బలక్ష్మి గారి గాత్ర మాధుర్యం మరోసారి మీ టపాలో…
  ఈ ఆట మొగలుల కాలంలో మొట్టమొదటగా ఆడారు…
  వాళ్ళు పెర్షియా నుంచి తెచ్చిన ఆట…
  దీనిని గంజీఫా అంటారు..(పెర్షియాలో గంజీఫా అంటే పేక ముక్కలు)
  పది కార్డులతో ఆడేది కనుక మన హిందువులు దశావతారాలుగా మార్చుకొని ఆడేవారు..
  సుమారు 18 …19 …ఏళ్ళ క్రితం దూరదర్శన్లో సురభి అనే కార్యక్రమంలో దీన్ని గురించి వివరించారు
  సిద్ధార్థ్ కక్,రేణుక సహానీ….
  ఇప్పటికీ మారుమూల పల్లెలలో ఉత్తరభారతంలో పెద్దవాళ్ళు ఆడుతూ ఉంటారని విన్నాను…
  అభినందనలు శర్మగారూ! మరుగున పడిన ఆతని పరిచయం చేసారు మీ పోస్ట్ ద్వారా…
  @శ్రీ

  • Rate This

   @శ్రీ గారు,
   మన తెనుగునాట ఏబది సంవత్సరాల కితం ఈ ఆట ఆడుతుండగా చూశాను. ఆడలేదు, ఆట గురించి విన్నాను, చూశాను తప్పించి ఆడలేదు అందుకు వివరాలు చెప్పలేకపోయా. మీరు మరిన్ని విషయలు చెప్పేరు.
   ధన్యవాదాలు.

ప్రకటనలు

రచయిత: kastephale

A retired telecom engineer.

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-దశావతారీ(మరుగునపడిన మన ఆట.)”

 1. శర్మ గారు, మీ బ్లాగు నిశ్శబ్దంగా ఉండడంతో బ్లాగులోకంలో వెలితిగా ఉంది గత వారం రోజులుగా. అలాగే ‘జిలేబి’ గారు కూడా ఉలుకూపలుకూ లేదు; దాంతో బ్లాగులోకం “చప్పగా” ఉంది. పుష్కలంగా లభిస్తున్న “వేడి తేనీరు” సేవిస్తూ 🙂 పరిస్ధితి ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఎండలు తప్ప ఇబ్బంది పెడుతున్న ఇతర చికాకులేమీ లేవని తలుస్తాను.

  మెచ్చుకోండి

  1. నేనూ అదే అనుకుంటున్నాను విన్నకోట గారు. జిలేబి గారు కూడా కనిపించడం లేదు మరి. ఈ రోజు కష్టేఫలి గారి టపా కన్పించాక ఉత్సాహం వచ్చింది.

   మెచ్చుకోండి

   1. Chandrikaగారు,
    నేను ఉడుకు బాధలో ఉన్నానండి 🙂 అమ్మవారి సంగతే తెలీదు, చెబుతారేమో చూద్దాం! పత్తేదారీ చెయ్యాలింక లేకపోతే 🙂
    ధన్యవాదాలు.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. విన్నకోట నరసింహారావుగారు,
  ఏం చెప్పను ! ఉడుకు!! చల్లటి గదినుంచి బయటికొస్తే పొయ్యిలోకొచ్చినట్టే ఉంటోందండీ! మాకు బట్ట తడుపు చినుకులు తప్పించి మంచి వర్షమే లేదు!! పుణ్యాత్ములం కదండీ 🙂 తెల్లవారుగట్ల కూడా చెమటులు దిగబోస్తుంటే……ఆపైది బ..ద్ధకం…. ”మనంరాస్తే ఊరికి ఉపకారమా మానేస్తే దేశానికి నష్టమా” అని మిత్రులు బోనగిరిగారన్నమాట గుర్తొచ్చి 🙂 చల్లటిగదిలో కూచుని చిన్నఫోన్ లో పేపర్లన్నీ తిరగేస్తూ, అన్నీ చూస్తూ కాలక్షేపం… ఇవాళ రాత్రి కొద్దిగా, మరీ కొద్దిగానే లెండి, లెక్క చినుకులు పడి …. ఈ సంవత్సరం కరంటు వారు బాగానే కరుణించారు..అప్పుడప్పుడు పోయినా…

  అమ్మవారి గురించి తెలియదు….ఎక్కడో,ఎటులో…..శాస్త్రిగారడిగారు, చంద్రిక గారడిగారు, మీరూ అడిగారు……వారి గురించి నేను అడగడం లేదు లెండి 🙂 అమ్మవారు కనపడి నేటికి పందొమ్మిది రోజులు గడిచాయి…”ఆరోగ్యంగానే ఉన్నాను” అన్న ఒక్కమాట చెప్పిపోవచ్చుగా! నేనడగనండీ,అసలడగను,అడగనుగాక అడగను,ఎందుకడగాలిట? ఎంటట వారి గొప్ప 🙂
  మీ అభిమానానికి
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

  1. ఎందుకడగాలి అంటే ఎంతైనా “జిలేబి” గారు (బ్లాగ్) పరిచయస్థులు కదండీ, అందువల్ల ఏదో యోగక్షేమాలు విచారిద్దామని. ఈ మధ్యనే ఓ బ్లాగ్ లో (?) తను రాసిన వ్యాఖ్యలో కళ్ళకి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటాను అంటూ రాసినట్లు జ్ఞాపకం. నిజంగా ఆ పరిస్ధితే గనకయితే బహుశః ఆ పని మీదేమన్నా ఉన్నారేమో?

   మెచ్చుకోండి

   1. విన్నకోట నరసింహారావుగారు,
    నిజంకదా! ఎవరైనా అడుగుతారో లేదో, మనల్ని మరిచిపోతారా? కనపడకపోతే అనుకున్నారేమో! అదేం కుదరదండి, కనపడలేనప్పుడు చెప్పాలికదండీ,నేను చెప్పిపోతున్నాకదండి! చెప్పకుండా వెళితే డైస్-నాన్ అవుతుందికదా! అంతా మనగోలగాని అమ్మవారు ఉలుకూపలుకు లేదే!

    కళ్ళుకాదనుకుంటా! ఇలా కళ్ళ బాధని అబ్బో నాకు తెలిసినప్పటినుంచి అంటూనే ఉన్నారు! కళ్ళు ఐతే ఎంతండి వారంచాలు. రెండు కళ్ళకి ఒకసారి ఆపరేషన్ చెయ్యరు, బాగున్నా అన్నమాట చెప్పడానికి ఎంత సమయంకావాలేంటండి? నాలుగురోజులకే విదేశమో వెళ్ళొచ్చి ఉంటారు! ఆ తరవాత బద్ధకం…. నాకెందుకో ఇదే అనిపిస్తోందండి. తానా యో నాటాయో జరిగింది కదండీ దానిగ్గాని వెళ్ళేరేమో!
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s