శర్మ కాలక్షేపంకబుర్లు-మనం మరచిన కూరలు.

Posted on ఆగస్ట్ 21, 2012
15

Courtesy you tube

మనం మరచిన కూరలు.

మనం మరచిన కూరలా? కాదు, నిజంగా ఇప్పుడు మనకు దొరకని కూరలు.మనం అడవులను నిర్లక్ష్యం చేయడం మూలంగా, నరికేస్తున్నందు మూలంగా అంతరించిపోతున్న కూరలు. నిజం చెప్పాలంటే పల్లెలలో కూడా ఇవి దొరకటం లేదంటే పరిస్థితి ఎలా ఉన్నది తెలుస్తుంది. ఈ నెల 7 వ తారీకు టపాలో సునీత గారు వ్యాఖ్య రాస్తూ, వాక్కాయలు,షీకాయి ఆకు, నల్లేరు ఎలా ఉంటాయో చిత్రాలు పెట్టమన్నారు. అంటే వారికి పేర్లూ తెలియవు, అదేగాక వాటిని చూడను కూడా లేదని తెలుస్తూ ఉంది కదా. ఇటువంటి వారు ఎంత మంది ఉన్నారో చెప్పడం కష్టం కనక ఈ టపా లో వాటిని పెడుతున్నా. నాకూ గలిజేరు దొరక లేదు. దాని లింక్ ఇస్తున్నా చూడండి.https://kastephale.files.wordpress.com/2012/08/photo220007.jpg గలిజేరుని సంస్కృతం లో భృంగామలక, పునర్నవ అంటారు. ఇందులోని నల్లేరు సంపాదించడానికి నాకు పదిరోజులు, పది మందితో చెబితే, దొరికిందంటే పరిస్థితి ఊహించవచ్చును. పల్లెటూరి వారు తెలిసి ఉపేక్ష చేస్తున్నారు. పట్నవాసం వారు తెలియక మానేస్తున్నారు. పల్లెనుంచి తెస్తే కదా తెలిసేది, పట్నంలో. షీకాయాకు కొద్దిగా పుల్లగా ఉంటుంది,చిన్న చిన్న ముళ్ళు కూడా ఉంటాయి, కొద్దిగా వేడి చేస్తుంది.

లింకిస్తున్నా చూడండి మనం మరిచిన కూరలెన్నో, దగ్గరగా ఏభయి ఉన్నాయి. బొమ్మలు వాటి పేర్లు, వాటి శాస్త్రీయ నామాలిచ్చారు.

Click to access kondreddy_receipes.pdf

కొండ మామిడి, అడవి మామిడి అసలు తెలియవు. వెదురు చిగుళ్ళు కూర వండుకుంటారు. వెదురు బియ్యం మంచి శక్తి నిస్తాయి,అన్నంలా వండుకోవచ్చు, వ్యాము దుంప గర్భ నిరోధాని మందుట, మాకూ తెలియదు. అడవి పెండలం విని ఉండరు, మగసిరిగడ్డ పేరే చెబుతోంది చూడండి. గొడ్డు కూర నేనూ వినలేదు, చామ కూర వాడుతాము, పులుసు పెట్టుకుంటే బాగుంటుంది. గురుగు కూర నేత్రాలికి మంచిదిట. సప్పి కూర పుల్లగా ఉండి దీర్ఘరోగాలికి మంచిదిట. చికిలింత కూర నేను ఎరుగుదును, నేత్రాలు, ఊపిరి తిత్తులకు మంచిదిట. పొన్నగంటి కూర బలుసు కూర ఇవి దొరికే సావకాశాలున్నాయి. పొన్నగంటి కూర మూత్ర రోగాలకి, బలుసు కూర ఇనుముకి ప్రసిద్ధి. గాజు కూర డయాబెటిస్ కి మందు. తిప్ప తీగ, దీనిని సంస్కృతంలో అమృత అంటారు, డయాబెటిస్ కి మరి చాలా వ్యాధులకి మందు, ఆకు హృదయాకారంలో ఉంటుంది. ముళ్ళ వంగ, అడవి కాకర రెండూ మందులలా కూడా ఉపయోగిస్తారు. కారు నిమ్మ చూశారా ఎలా వుందో. ఎర్ర చిత్రమూలం చికెన్ తో తింటే బాగుంటుందిట. ఉత్తరేణి, ఇది చాలా గొప్ప మందు, ఇది ఉన్న చోటికిపోతే ముళ్ళలా ఉన్నవి పట్టుకుంటాయి, వీటిని ఉత్తరేణి బియ్యం అంటారు,ఎండిన వాటిని బాగుచేసుకుని, పరమాన్నం వండుకు తింటే, బాగుంటుంది. తెలగ పిండి కూర దొరుకుతుంది, ఇది తింటే మూత్రపిండాల రాళ్ళు కరుగుతాయి. మన దగ్గర దొరికేది, నిర్లక్ష్యం చేసేవి, అరటి పువ్వు, అరటి దూట. దూట రసం తాగితే మూత్రపిండాల రాళ్ళు కరుగుతాయి. లైన్ తోటకూర మంచి ఆకు కూర తెలుసా?. గోగుపువ్వు డిప్పలు పచ్చడి బాగుంటుంది. మెక్సికో లో పండుతుందిట, రకరకాల రంగులలో మొక్క జొన్న వింత కదా, ఈ వేళ చూశా పేపర్లో. చూడండి మీకు దొరికేవాటిని ప్రయత్నం చేయండి, లేదా మొక్కలు దొరికితే పెరట్లో వేసుకోవచ్చు, వీలున్నవారు..

రచయిత: kastephale

A retired telecom engineer.

25 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మనం మరచిన కూరలు.”

 1. Namaste sir,
  Photos lo choosanu atukumamidi choodataaniki Chandra kantam poolu chettu laaga vundi ,Chandra kantam poolu lo pink,vankaya colour poolu kooda vuntaayi.
  Inka photo lo Vunna konni rakaala aakulu Karnataka lo vandukuntaaru.memu Bangalore lo vuntaamu ikkada rural lo aadavaallu vanakaalam lo velli rakarakaala aakulu kosukostaru raagi polallo.memu letha veduru koora kooda ikkada tinatam choosanu.
  Thanks for sharing photos and information.
  RAJESWARI.

  మెచ్చుకోండి

  1. RAJESWARIగారు,

   చాలా కూరలు ఇందులో చెప్పినవి తూగోజి అడవి ప్రాంతం మారేడుమిల్లిలో దొరుకుతాయండి. ఆధునికులమై పోయాంకదా! 🙂 తెలిసి కొంత,తెలియక కొంత వాడకం మానేశాం. వెదురు మొలకలు మేమూ తిన్నాం, పక్క దొడ్డిలో పెంచాం ఒక రెండు దశాబ్దాలు. గొడవ చేసి తీయించేశారు,పాములొస్తాయని.

   నిజానికి మనకున్నది గొప్ప ప్రకృతి సంపద.
   నెనర్లు.

   మెచ్చుకోండి

  1. Zilebiగారు,

   కోయంబేడు మార్కట్టా మజాకా! అందులోనూ మడిచారతో కూరల బేరం… 🙂
   గోడ దెబ్బ చెంప దెబ్బ అంటే ఏంటో మెక్సికో ప్రస్థుత పరిస్థితిని చూసి తెలుసుకోవచ్చండి.
   నెనర్లు.

   మెచ్చుకోండి

 2. ఏమండోయ్ కష్టే ఫలే వారు,

  తుంగ ముస్తలు అంటే ఏమిటి ? దయచేసి తెలుప గలరు.

  అధిక దప్పిక – (Thirst)

  తుంగముస్తలు, ధనియాలు సమభాగాలుగా కలిపి, నూరి, ఈ పొడి అర్ధ శేరు నీటిలో రెండు తులములు వేసి సగము మిగులునట్లు గా కాచి, చల్లారిన తరువాత వడబోసి ; ఈ కషాయము తాగుచున్న అతిసారము వలన కలిగిన అతి దాహము హరించును ;

  https://archive.org/details/chitkavaidyamvol018988mbp

  జిలేబి

  మెచ్చుకోండి

  1. Zilebiగారు,

   తుంగని గరిక,దుర్వారము అంటారు. ఇది సన్నని కాడలలా నేలమీద పాకుకుంటూపోతుంది, కణుపులుంటాయి. కణుపు కణుపుకీ భూమిలోకి వేర్లుంటాయి. ఈ వేర్ల దగ్గర భూమిలో చిన్నవైన, నల్లని కాయలుంటాయి, ఇవి కొద్ది సువాసనగా కూడా ఉంటాయి. వీటినే తుంగ ముస్తెలు,తుంగ కాయలు అంటారు. తుంగ మూత్ర కోశం మీద చాలా బాగా పని చేస్తుంది, ముస్తెలు మీరు చెప్పినట్టు పని చేస్తాయట.
   నెనర్లు.

   మెచ్చుకోండి

   1. జిలేబి గారు,

    ఫోటో ప్రయత్నం చేస్తాను.

    వీటిని ’తుంగ ముస్తెలు’ అని అడిగితే కొట్టువాడిస్తాడు, తెనుగునాట. మరి మీదేశంలో దొరుకుతాయా? అన్నదే అనుమానం. 🙂 అక్కడా ఆయుర్వేద మందుల షాపుల్లో దొరకచ్చేమో! వీటిని తలకు రాసుకునే కొబ్బరి నూనెలో కూడా వేసుకుంటారు,సువాసనకోసం. అన్నట్టు మరచా ‘మని’ ఏమంత పెద్ద ఖరీదుండకపోవచ్చు.

    నెనర్లు.

    మెచ్చుకోండి

  1. ‘కనకు – వినకు – అనకు’ గట్టిగా ‘చెడు’గూర్చి
   మూడు కోతు లిటుల మొత్తి చెప్ప ,
   స్మార్టు ఫోను విడువ జనదేల నాల్గోది ?
   ‘పడతి’ భావ మేమి ? భాస్కరయ్య !

   మెచ్చుకోండి

   1. వెంకట రాజారావు . లక్కాకుల గారు,

    మొదటి మూడు కోతులు గాంధీ గారితోనే చెల్లిపోయాయండి. ఇప్పుడు నాలుగో కోతి కాలం కదా! కాలమహిమ

    ’ఉష్! డిస్టర్బ్ చెయ్యకు’ అన్నదేనండి 🙂

    నెనర్లు

    మెచ్చుకోండి

   2. చెడు వినకోయ్! మాటాడకు
    చెడు! చూడకు చెడు జిలేబి! చేర్చితి సరికొ
    త్త డుగుడుగు డుక్కు చూడకు
    అడుగడుగునకు మొబయిలు సయాటల రమణీ !

    జిలేబి

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. కోతులతో చెప్పించుట
  జాతికి , కొత్తేమి కాదు , సారూ ! ఐనన్ ,
  కోతులు శాఖా చంక్రమ
  జాతులు కద ! , వాటికంటె చాంచల్యు లమా ?

  మెచ్చుకోండి

  1. విన్నకోట గారు,

   తుంగ ముస్తెలంటే గరిక వేళ్ళకి భూమిలో పండే నల్లని కాయలు,చిరు సువాసనకలవి, వీటిని మందులలో వాడతారు.

   తుంగలో తొక్కడం అని ప్రయోగం ఉంది, అంటే గడ్డిలో పడేసి నేలలోకి తొక్కెయ్యడం, పనికి రానిదిగా చేయడం అంటారనుకుంటా. 🙂

   బావంచాలు వేరు, తుంగ ముస్తెలు వేరు. బావంచాలూ మొక్కనుంచి వచ్చే గింజలే

   నెనర్లు

   మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: