శర్మ కాలక్షేపంకబుర్లు-అత్తింటి కాపరం….

Posted on ఆగస్ట్ 20, 2012
10

Courtesy you tube

అత్తింటి కాపురం.…..

అనానగా ఒక పల్లె అందులో ఒక పేద దంపతులు, వారికి నల్గురు సంతానం. మొదటగా లక్ష్మీ దేవిలా ఆడపిల్ల పుట్టింది. సంతోషించారు దంపతులు, సంపదకిలోటుగాని సంతానానికి కాదు. అమ్మాయికి పెళ్ళి వయసొచ్చింది. సంబంధం చూశారు, కట్న కానుకలు మాట్లాడుకున్నారు. పాపం పేద తండ్రి ముద్దు ముచ్చట చ్చేద్దామనుకునాడు కాని కాలం కలిసి రాలేదు. అనుకున్న కట్న కానుకలన్నీ ఇవ్వలేకపోయాడు. అమ్మాయిని అత్తింటి వారు కాపరానికి తీసుకెళ్ళేరు. కలిగిన చీర సారె పెట్టి పంపేరు దంపతులు.

అమ్మాయి అత్తవారింటి కెళ్ళాలంటే ఒక నది దాటి వెళ్ళాలి. అమ్మాయి అత్తవారింటి కెళ్ళి చాలా కాలమయింది కనక, చూసి వద్దామని బయలు దేరేడు, తండ్రి. నది దాటి అమ్మాయి అత్తవారింటి కెళ్ళేడు. వియ్యాలవారు గౌరవం చేశారు, కట్న కానుకల గురించి కూడా ఏమీ అనలేదు. వారి గౌరవానికి మురిసిపోయాడు, తండ్రి. ఒక రోజుండి బయలు దేరుతూ, వియ్యాలవారి దగ్గర శలవు తీసుకుని వెళుతూ అమ్మాయిని అడిగేడు, అమ్మా! “అత్తింటి కాపురం ఎలా ఉంది?” అని, నెమ్మదిగా. దానికా పడుచు “నాన్నా! అత్తింటి కాపురం మోచేతికి దెబ్బ తగిలినంత సుఖంగా ఉంది“అంది. పిచ్చి తండ్రి దెబ్బ తగిలితే కొద్ది బాధ ఉండటం సహజం కదా, అలాగే అత్తిల్లన్న తరవాత ఆ మాత్రం బాధ ఉండటం సహజమని సరి పెట్టుకుని బయలుదేరేడు. నది ఒడ్డుకు వచ్చాడు, పడవలో ఒక కాలు పెట్టి మరొక కాలు తీస్తుండగా పడవ కదిలి, మోకాలికి దెబ్బ తగిలింది. నెప్పికి బాధ పడ్డాడు. ఓర్చుకుని పడవ ఎక్కేశాడు. పడవ బయలుదేరింది. కొద్ది దూరం వెళ్ళిన తరవాత సరంగు తెరచాప ఎత్తటం ప్రారంభించాడు. అప్పుడు తెర చాపకొయ్య మోచేతికి తగిలింది, పైకి దెబ్బ కనపడలేదు కాని, ప్రాణం జిల్లార్చుకుపోయింది. కాసేపటికి తెప్పరిల్లి, కూతురు అన్న మాటలు గుర్తుకు తెచ్చు కున్నాడు. అత్తింటి కాపురం మోచేతికి దెబ్బ తగిలినంత సుఖంగా ఉందంటే, కాపురం పోలీసు దెబ్బ లాగ పైకి కనపడకుండా ప్రాణం జిల్లార్చుకుపోయేలా ఉన్నదని అర్ధం చేసుకుని ఇంటికి వెళ్ళి అప్పో సప్పో చేసి అమ్మాయికిస్తానన్న కట్నకానుకలు తీసుకు వెళ్ళి వియ్యాల వారికిచ్చి,తిరిగి వచ్చేడట.మోచేతికి దెబ్బ తగిలితే ఎంత బాధగా ఉంటుందో అప్పుడు తెలిసిందా పిచ్చి తండ్రికి.

మరొకనానుడి .
సారెపెట్టకుండా పంపేను కూతురా నోరుపెట్టుకు బతకమందిట.

సామాన్య దంపతులు, పెళ్ళి చేసి కూతుర్ని అత్తవారింటికి పంపుతున్నారు. మొదటగా కాపరానికి పంపేటపుడు సారె చీరె పెట్టిపండం మన ఆచారం, లేకపోతే తరవాత కూడా పెట్టచ్చు. సారె అంటే మంచం, కంచం నుంచి వారి తాహతుకు తగిన, అమ్మాయి కాపురానికి అవసరమైన వస్తువులన్నీ పెడతారు. మొన్నీ మధ్య ఒకమ్మాయిని అత్తవారింటికి పంపుతూ, అమ్మాయి తల్లి తండ్రులు, డబల్ కాట్ మంచం, బెడ్ లు, వెండి కంచాలు,టి.వి, వి.సి.ఆర్,గేస్ స్టవు, కుక్కర్, ఇతర వంట సామాను, చెంచాలతో సహా, రెండు గాడ్రెజ్ బీరువాలు,ఒక కారు, ఇంకా ఏవేవో పెట్టేరట, నాకు చెప్పేరు గాని గుర్తులేదు. మొత్తం వీటికి గాను పది లక్షలు ఖర్చుపెట్టేరట. అందుకే అన్నారు, జుట్టున్నమ్మ కొప్పెట్టుకున్నా బాగానే ఉంటుంది, సిగ పెట్టుకున్నా బాగానే ఉంటుందని. కాని సామాన్యులు వారిని పోలిక తీసుకుని కష్టాలలో పడకూడదు కదా. కాని సాగుబడిలేక ఇక్కడ ఈ తల్లి తండ్రులు సారె పెట్టలేదు, అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేటపుడు. అప్పుడు తల్లి చెబుతుంది తన తెలివయిన కూతురికి, సారె పెట్టకుండా పంపుతున్నా కూతురా నోరెట్టుకు బతుకు అంటే సారె పెట్టలేదని అత్తవారంటారు, వీలును బట్టి సమాధానం చెప్పి తప్పించుకు బతకమని, లేకపోతే ఎదురు తిరగమని, తల్లి సలహా. .ఇప్పుడు రోజుల్లో, కోడలు కాపరం చేస్తే అంతేచాలు అనుకుంటున్నారు, అత్త మామలు

రచయిత: kastephale

A retired telecom engineer.

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అత్తింటి కాపరం….”

 1. అత్తింటి కాపురమ్ములు
  మొత్తముగా మారెనయ్య మొత్తిరి భామల్
  కొత్తగ వచ్చిన మగడిని
  కుత్తుక బట్టుచు శతముఖి కుదురుగ గనుచున్ !

  జిలేబి

  మెచ్చుకోండి

 2. తెలిసో తెలియకో ఒకప్పుడు వివాహసంప్రదాయంలోకి వ్యాపారాన్ని చొరబడనిచ్చారు. అమ్మాయిలు ఒకప్పుడు మోచేతికి దెబ్బ తగిలినంత “సుఖంగా” వున్నా, ఇప్పుడు నోరు పెట్టుకు బతకాల్సి వచ్చినా దాని పర్యవసానాలే కదా.

  మెచ్చుకోండి

  1. YVR’s అం’తరంగం’
   కట్నకానుకలన్నవి కలిగిన వారి వేడుకలు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు లేనివారు వాటిని అంది పుచ్చుకున్నారు. ఆ తరవాత కాలంలో అవి కాస్తా గుదిబండలయ్యాయి, వ్యాపారం పెళ్ళిలోకి అడుగెట్టింది. అప్పటికి ఇప్పటికి నోరెట్టుకు బతికే వాళ్ళవే రోజులు 🙂

   నెనర్లు.

   మెచ్చుకోండి

 3. తిరుకట్టె బట్టుము జిలే
  బి, రుసరుసల్లాడుచు పతి బిత్తరు బోవన్
  గురిజూచి కొట్టుము సుమా
  మరి సారెలడుగరు పడతి మహిలో యెవరున్ 🙂

  జిలేబి

  మెచ్చుకోండి

 4. ఇప్పుడు ఆడపిల్లల కొరతవలన మళ్ళీ కన్యాశుల్కం తెరమీదకొచ్చింది.. ఆడపిల్ల తండ్రి కన్నా తల్లే బేరసారాలు చేస్తోంది..
  “ఇన్నాళ్ళూ ఇంత కష్టపడి, ఖర్చుపెట్టి చదివించాం అమ్మాయిని….దానికి తగ్గ ఫలితముండొద్దా??” అని ప్రశ్నిస్తున్నారు..

  మెచ్చుకోండి

  1. Shankar Voletiగారు,

   ఏ కాలంలో నూ మగ ఆడ నిష్పత్తి సమానంగా ఉండదండి, లేదు కూడా! ఆడ పిల్లలని చంపేస్తున్నారు కడుపులోనే అన్నది పూర్తి నిజంకాదు, ఒక దురాచారాన్ని ప్రవేశపెడుతున్నారు, స్వార్ధ పరులు. దీనికితోడు ఆడపిల్లల తల్లి తండ్రులుకి అమ్మాయి సంపాదన అనుభవించాలనే కొత్త కోర్తిక మొదలయింది. ఒక చీడ వదిలితే మరో చీడ వివాహ వ్యవస్థని పీడిస్తోంది.

   ముఫై ఏళ్ళొచ్చిన ఆడపిల్ల నాకప్పుడే పెళ్ళేంటీ అంటున్న రోజులు కదా!

   గురజాడ వారి కన్యాశుల్కానికొచ్చినంత పేరు కాళ్ళకూరి వరకట్నం నాటకానికి రాలేదేం?

   నెనర్లు.

   మెచ్చుకోండి

   1. మిత్రులు శర్మగారు,
    గురజాడ వారి కన్యాశుల్కానికొచ్చినంత పేరు కాళ్ళకూరి వరకట్నం నాటకానికి రాలేదేం?
    సరిగ్గా ఇదే ప్రశ్న నా బుధ్ధికీ తోచింది. ఈ రోజున వ్రాదామనుకున్నాను కాని నాకు సమయం లేదు. క్లుప్తంగా చెప్పాలంటే కారణం పెద్దగా ఏమీ‌లేదు. కన్యాశుల్కం రచయితకు ఒక సాహిత్యకారుడిగా ఉన్నపేరు కాళ్ళకూరి వారికి రాలేదు. పైగా వామపక్షాల వారు సహజంగా బ్రహ్మద్వేషులు. బ్రాహ్మణీకం పైన నిర్దాక్షిణ్యంగా బోలెడు చెణుకులు విసిరిన కన్యాశుల్కం వారికి శిరోధార్యంగా కనిపించటంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటికీ‌ మనదేశంలో మేథావులుగా చెలామణీ అయ్యేవారి తప్పనిసరి లక్షణాలలో ఒకటి సనాతన ధర్మం‌పట్ల తీవ్రమైన నిందాత్మక ధోరణి. దీనిని వెలిబుచ్చటానికి బ్రహ్మద్వేషం వెళ్ళబుచ్చటం‌ ఒక ఆయుధం. కన్యాశుల్కం‌ గొప్పనాటకమా కాదా అన్న చర్చకు దిగనవసరం‌ లేదు. ఇతరమతవ్యవస్థలలోని ఏకుళ్ళునైనా ఇటువంటి సాహిత్యప్రక్రియద్వారా ఎవరైనా వెలుగులోనికి తెస్తే ఏం జరుగుతుంది నేడైనా? రచనపై దహనకాండ – రచయితపై మారణకాండ. హిందువుల్ని ఏమనండి – ఫరవాలేదు. బ్రాహ్మణుల్ని ఎంతైన తిట్టండి – మరీ మంచిది. అదీ సంగతి.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

   2. వయసాయెను ముప్పై యేం
    డ్లు ;యవ్వనము బోయెనమ్మ డుమ్మా యనుచున్
    శయనమ్మున నిదురయు బో
    వ యోషిత వలపుల చిగురు వగచుచు బోయెన్ !

    జిలేబి

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

   3. తాడిగడప శ్యామలరావుగారు,

    అభ్యుదయవాదం అంటే ఒకరిని నిందించడం,హేళన చెయ్యడం, వారి పట్ల అసహనంతో ప్రవర్తించడం ఇంతేనాండీ? మేధావుల లక్షణాలు కూడా నంటారా? శహభాష్! ఎంత పురోభివృద్ధి 🙂

    నెనర్లు.

    మెచ్చుకోండి

 5. కన్యా శుల్కపు రోజులు
  విన్యాసము జేయుచు మరి విరివిగ వచ్చె
  న్నన్యతమ మెల్లపుడునౌ
  కన్యాత్వమునకు జిలేబి కండ్లన నలుసే !

  జిలేబి

  మెచ్చుకోండి

 6. కన్యాశుల్కం రచనా కాలానికి దొర్ల పాలన నడుస్తోంది..ఆ నాటకంలో “మన వాళ్ళు వఠ్ఠి వెధవాయలోయ్” అని రాయడంతో బాటు అడపాదడపా దొర్లని ఆకాశకెత్తేసాడు రచయిత..
  అభ్యుదయ రచన అనగానే శ్యామలరావు గారన్నట్టు హిందూమతాచారలను, బ్రాహ్మణులను ఆడిపోసుకోవడమే అన్న స్థితికి దిగజార్చింది..అవార్డులు కూడా ఈ ఇతివృత్తం గల సినిమాలకే ఇస్తారు..
  మరో మతం లేదా కులం జోలికోస్తే చమడాలెక్కదీస్తారు..

  మెచ్చుకోండి

  1. Shankar Voletiగారు,

   కన్యాశులకం నాటకం రాసేనాటికే బాల్య వివాహాలు వెనకబట్టినట్టున్నాయి. పాతికేళ్ళలోపే వరవిక్రయం నాటకం రాయబడింది, కాళ్ళకూరివారి చేత. ఈ నాటకం మరి కొన్ని నాటకాలూ సమాజంలోని చెడ్డ ఆచారాలను సూటిగా ఖండించాయి, విరుగుడేమో కూడా సూటిగా చెప్పేయి.. వరవిక్రయంలో కమల పాత్ర చికిలీ చేసిన చురకత్తి. ప్రతి ఇంట కమల లాటి అమ్మాయిలు స్వతంత్రంగా ఆలోచించేవారు బయలుదేరితే? ఈ ఆలోచనే వణికించింది…. చాలా అణుకువగా అవేశపడకుండా కోర్ట్ సీన్ లో కమల మాటాడిన ప్రతి మాట ఒక తూటాలా పేలుతుంది గిరీశాల గుండెలలో. ఈ నాటకానికి పేరొస్తే అటువంటి గిరీశాల బతుకు బయటపడినట్టే, అందుకు ఈ దురాచారం కొనసాగించాలనే ఈ నాటకాన్ని పైకి రానివ్వలేదు,స్వార్ధపరులు.

   మరోమాట నేటికీ వరకట్న దురాచారమూ పోలేదు, బాల్య వివాహాలూ పోలేదు, అదీ వింత.
   నెనర్లు.

   మెచ్చుకోండి

 7. మేధావుల లక్షణాలలో అసహనం ఒకటి కాదండి. మేథావి నిజంగా సమాజహితం కోరి సత్యాన్వేషణ చేసేవాడు. కాని తాము చేసేది మాత్రమే సత్యన్వేషణ తాముచెప్పేది మాత్రమే సత్యం అన్న సంకుచితత్వం మేథావి లక్షణం కానేకాదు. కాని కొందరు సంకుచితులు తామే సత్యప్రవర్తకులనీ సత్యప్రబోధకులమనీ తిరిగి ప్రశ్నించేవారిని అహంకారులనీ అనటం లోకంలో ఎప్పుడూ ఉన్నదే. నిజమైన మేథావి ఏదో‌ ఒక సిధ్ధాంతదృక్పథంలోంచి గోచరమయ్యేది మాత్రమే సత్యమని వాదించడు. ఆధునికతరాల మేథావులు సిధ్ధాంతప్రాతిపదికల మీద చీలి కనిపిస్తుండటం వారు మేథావి పదానికి పూర్తిగా అర్హత కలవారు కాకపోవచ్చన్నదే సూచిస్తుంది. అభ్యుదయవాదం పేర ఒకరిని నిందించడం,హేళన చెయ్యడం, వారి పట్ల అసహనంతో ప్రవర్తించడం అలాంటి ధోరణులను అసమగ్రమేథావంతుల్లో మాత్రం తప్పక చూడవచ్చును.

  మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: