శర్మ

15.07.2016 స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్ముఖినామ సంవత్సర ఆషాఢ శుక్ల ఏకాదశి  శుక్రవారం

తెల్లవారుతోంది పొద్దుగూకుతోంది.జీవితం గడచిపోతోంది. పుట్టినది మొదలు 75 ఏళ్ళు గడచిపోయాయి, సాధించినదీ కనపడటం లేదు. ఏం చేస్తున్నాం ఎందుకుచేస్తున్నామో తెలియనితనం లో కొట్లాడుతున్నాం. చేస్తున్నది ఇహ పరాలకి అనువైనదిలా లేదు. మరేం చేయాలి? అదే నేడు అనగా స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్ముఖినామ సంవత్సర ఆషాఢ శుక్ల ఏకాదశినాడు ఉదయమే అనిపించినది, చల్లగాలిలో తిరుగుతుండగా.

ఎవరికైనా చివరగా ఆశ్రయం శ్రీరామాయణమే, దానినే ఆశ్రయించమని వినిపించింది. అన్నిటిని వదిలేసి శ్రీరామాయణాన్ని యువతకి అవసరమైన తీరులో నాకుతోచినది చెప్పాలనేదే ఈ ప్రయత్నం. నేను చెప్పబోయే మాట శ్రీరామచంద్రునిదే, శ్రీరాముడు పలికించేదే!

22.08.2016

ఈ బ్లాగ్ ను ఒకందుకు మొదలు పెడితే మరొకందుకు ఉపయోగపడింది, ఏది ఎలా జరగాలో ఎవరికెరుక!

ప్రకటనలు