శర్మ కాలక్షేపం కబుర్లు-పిల్లలూ దయచూపండి

Posted on సెప్టెంబర్ 24, 2011
పిల్లలూ దయచూపండి
తల్లి తండ్రులమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినుర వేమ.
పాశ్చాత్య సంస్కృతి మనలో ఎలా వేళ్ళూనుకుని వెర్రితలలు వేస్తూవుందో అన్నదానికి ఇది ఒక వుదాహరణ.చదవండి.
మావీధిలో ఒకరికి లేకలేక కలిగింది ఒకడే కొడుకు. ఆ దంపతులు ఆ కుర్రాణ్ణి అరచేతులలో పట్టుకుని పెంచారు. పెద్దవాడైన కొడుకుకి తినడానికి కూడా లేని దంపతులు రాత్రి,పగలు అనక కష్టపడి, చదివించారు. కుర్రవాడు బాగానే చదువు కున్నాడు. సాఫ్ట్ వేరు ఇంజినీర్ అయ్యాడు. ఫారిన్ వెళ్ళేడు. బాగానే సంపాదించుకున్నాడు. తల్లి తండ్రులు ఎప్పుడూ కొడుకు ఆదాయ వ్యయాలగురించి అడగలేదు. మంచి కుటుంబంలో పెళ్ళి కుదిరింది. పెళ్ళి భారీగా చేసారు. పెళ్ళిఖర్చులన్నీ కూడా తల్లితండ్రులు పెట్టేరు. పెళ్ళి అయిన మొదటి శ్రావణ మాసంలో కోడలిని తీసుకు వచ్చారు. పట్నం పిల్ల పల్లెలో బురద రోడ్లకి ఇబ్బంది పడింది, అత్తగారితో పేరంటం పిలవడానికి వెళ్ళి…… ఆత్తగారు కోడలిని వూళ్ళోవాళ్ళకి పరిచయం చేయబోతే కోడలు తల తిప్పుకునేది. ఎందుకో అభిప్రాయ భేదాలు వచ్చాయి. తల్లి తండ్రులు కారణం ఏమీ లేదంటారు.కొడుకు కారణం చెప్పడు. తల్లితండ్రులు ఊహించుకుని అనుకున్నవి ఏమీ కాదన్నడట.. మిత్రుడికి కూడా కారణం చెప్పలేదు. కొడుకుకి బొంబాయిలో వుద్యోగం వచ్చింది. పెళ్ళాన్ని తీసుకు వెళ్ళిపోయాడు. అంతే. మరి కబురులేదు. మాట లేదు. ఫోను లేదు. వీళ్ళు ఎరిగివున్న అడ్రసుకి వుత్తరాలు రాస్తే అడ్రసువారు అక్కడ వుండటం లేదని వుత్తరాలు తిరిగివచ్చేయి. కొడుకు స్నేహితునిచేత మాట్లాడించడానికి ప్రయత్నంచేస్తే కొంత కాలానికి స్నేహితునితో మాట్లాడి తనకు తల్లితండ్రులు లేరు వాళ్ళ గురించి తప్పించి మరేమైనా మాట్లాడమని స్నేహితునితో అన్నాడట. ఈ విషయం స్నేహితుడు బాధ పడుతూ చెప్పేడు. వీళ్ళు బొంబాయిలో తెలిసిన వారి ద్వారా మంచి చెడ్డలు కనుక్కోడానికి ప్రయత్నం చేస్తే మొదటిసారి దొరికారు, రెండవసారికి ఇల్లు మారిపోవడం మూలంగా విషయాలు తెలియలేదు. పనిచేసే ఆఫీసుకు ఫోన్ చేయబోతే ఇక్కడ మానేసారని చెప్పేరు.
కొంత కాలం గడచింది. తల్లి తండ్రులు బెంగపెట్టుకున్నారు. దేముడికి మొక్కేరు ముడుపులు కట్టేరు. లాభం లేకపోయింది. బొంబాయి నుంచి ఎప్పుడేనా తన స్నేహితునితో పబ్లిక్ ఫోన్ నుంచి మాట్లాడేవాడు. తన అడ్రసు తెలియకుండా వుండేందుకు. మరికొంత కాలం గడిచాకా కోడలు నీళ్ళుపోసుకున్న కబురు గాలి వార్త తెలిసి వియ్యాలవారింటికి వెళితే వాళ్ళు ముఖంమీద తలుపులేశారట. మరికొంత కాలంకి పురుడు వచ్చినట్లు మగ పిల్లవాడు కలిగినట్లు గాలివార్త. కొడుకు అత్తవారింటికి వచ్చి వెళుతున్నట్లు వార్త. కుర్రవాడి అత్తవారింటికి పెళ్ళాంతో రాకపోకలు ఉన్నాయి. తల్లి తండ్రులకు పలకరింపుకూడా లేదు. తెలిసినవాళ్ళ ద్వారా కష్టపడి ఎక్కడ పని చేస్తున్నాడో పట్టుకోకలిగారు. తల్లి బాగా ఇబ్బంది పడటంతో ఒకసారి బయలుదేరి స్వయంగా దంపతులు చూసిరావడానికి బొంబాయి బయలుదేరి వెళ్ళారు. ఇంటి అడ్రసు దొరకలేదట. ఆఫీసుకి వెళితే ఇంక ఎప్పుడూ తన గురించి రావద్దని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడట. తల్లి తండ్రులను ఇంటికి తీసుకుపోలేదు, ఎలా వున్నారని అడగలేదు. ఏడుస్తూ తిరిగి వచ్చారు. దంపతులు ఇప్పటికీ అడుగుతున్నది ఒకటే కొడుకు కోడలు మనవడు క్షేమం వారి నోటి ద్వారా వినాలని వాళ్ళ పలకరింపు కావాలనే. ఈరోజుకూ తల్లి దేముడికి మొక్కుతూనే వుంది. వీళ్ళింకా వాడికోసం అవస్థపడుతూనే వున్నారు. పిల్లలూదయ చూపండి.

అందరూ అలావున్నారని అనను. తల్లి తండ్రుల మీద దయ చూపమని నేటి తరానికి వేడుకోలు. ఇది ఎవరిని కించపరచడానికి రాయలేదు. ఒక తల్లితండ్రుల అవేదన మీతో పంచుకోవాలని నా ప్రయత్నం.

kastephale on 11:12 వద్ద సెప్టెంబర్ 27, 2011 said: మార్చు
0 0 Rate This
@@@@
భమిడిపాటి ఫణిబాబుగారికి,
నిజంగా ఇది వ్యసనమే.మంచిదేగా

Reply ↓
భమిడిపాటి ఫణిబాబు on 16:36 వద్ద సెప్టెంబర్ 25, 2011 said: మార్చు
0 0 Rate This
బ్లాగులోకంలోకి స్వాగతం. ఇంక మీకు ఈ “వ్యసనం” అబ్బేసినట్లే !!!

Reply ↓

ప్రకటనలు

— శర్మ కాలక్షేపం కబుర్లు—

— శర్మ కాలక్షేపం కబుర్లు—

గురు, దైవ వందనం
కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు.
అడుక్కునైనా చదువుకోమన్న శ్రీ దేవరభట్ల రామా రావు గారికి నమస్కారాలు. శ్రీ. చెఱుకుపల్లి ప్రభాకర హనుమత్ కవిరాట్ లక్ష్మణశాస్త్రిగారికి,(Ch.P.H.K.LSastry) శ్రీ.జోస్యుల వేకట నరసింహంగారికి (J.V.Narasimham), సమయపాలన నేర్పిన శ్రీ. వర్రె అప్పలరాజు మాస్టరికి, తెలుగు మాస్టారు శ్రీ.సుబ్రహ్మణ్యంగారికి, శ్రీ. జాన్ మాస్టారికి వందనములు.

నేటి కాలంలో బోధగురువులు శ్రీచాగంటి కోటేశ్వర రావుగారికి నమస్కారం. తెలుగు వ్రాయడంకి తన బ్లాగు ద్వారా సహకారం అందించిన శ్రీభైరవభట్ల కామేశ్వర రావు గారికి నమస్కారం. నాలుగు తెలుగు అక్షరాలు తప్పులేకుండా వ్రాయడం వచ్చినంతనే బ్లాగు వ్రాయమని ప్రొత్సహించిన భమిడిపాటి ఫణిబాబుగారికి వందనం. ఏందరో మహానుభావులు అందరికీ వందనం.

తుండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపుల మంద హాసమున్
కొండొక గుబ్జరూపమున కోరిన విద్యలకెల్ల ఒజ్జవై
యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్.

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చినయమ్మ  తన్ను లో
నమ్మినవేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాభ్ధి యీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.

శ్రీ మాత్రేనమః.
సమయం సందర్భం ముందే చెప్పివున్నాను.మొదటి రోజు నమస్కారాలతో సరిపెడదమనుకున్నాను. కుదరలేదు.
నమః నుంచి నమస్కారమ్, దండమ్, సాష్టాంగ నమస్కారమ్,వందనమ్ వచ్చాయి,వణక్క్కం అరవ సంస్కృతితో వచ్చింది.
సలామ్ ఆలేకుమ్ ముస్లిమ్ సంస్కృతితో వచ్చింది. గుడ్ మార్నినింగ్, గుడీవెనింగ్ తప్పించి మరొకటి పడమటి దేశాల సంస్కృతిలో లేదు. మరేమైన వుందేమో మరి నాకు తెలియదు. వారికి నమస్కారం పెట్టడంకూడా రాదు.
అబ్బో నేటి సమాజంలో వంక దణ్ణాలు, వంకర దణ్ణాలు, అవసర నైవేద్యం లాగా అవసరదణ్ణాలు బోలెడన్ని.
దేవుని దగ్గర స అష్ట అంగ దండ ప్రణామం చేయనివాడు, అధికారం దగ్గర నేలమీద పొర్లుతాడు. ఇది విచిత్రం. చెప్పుకుంటూ పోతే చాల వుంది. మళ్ళీ కలుద్దాo.