శర్మ కాలక్షేపంకబుర్లు-మూఢ నమ్మకం.

Posted on నవంబర్ 8, 2012
21
మూఢ నమ్మకం.

నవంబర్ 20 ఉదయమే పూజ, టిఫిన్ తరవాత కంప్యూటర్ దగ్గర కూచున్నా, దగ్గరే ఉన్న ఫోన్ మోగింది, ఎత్తిమాట్లాడితే, “తాతా! ఎలావున్నావ”ంది మనవరాలు, “బాగున్నా! మీరంతా ఎలావున్నారం”టే, ఒక నిమిషం మాటాడలేదు, నోరు పెగల్చుకుని “తాతగారు ఉదయం కాలం చేసేర”ంది. ఉరుములేని పిడుగులాటి వార్త. ఒక్క సారిగా మెదడు మొద్దుబారి పని చెయ్యడం మానేసింది. “ఏమన్నావ”న్నా, మళ్ళీ చెప్పింది “ఉదయమే బాగోలేదంటే హస్పిటల్ కి తీసుకెళ్ళేరు మళ్ళీ, ఉదయం ఆరుకి తాతగారు….”అని భోరుమంది. ఏమనాలో ఎలా ఓదార్చాలో కూడా తెలియని స్థితిలో ఉన్నా,నేను. కొద్దిగా సద్దుకుని “భాధ పడకూడదు, ఇది సహజం, సృష్ఠి క్రమం” అని చెప్పేను. నామనసు మనసులో లేదు, ఇల్లాలి దగ్గరకెళ్ళి సంగతి చెప్పాను. ఆవిడ ఒక్క సారి నిర్ఘాంతపోయింది. ఇంతకీ వారెవరో చెప్పలేదు కదూ! వారు మా పెద్దమ్మాయి ( చెవిటి,మూగ అమ్మాయి )మామగారు, 91 సంవత్సరాల నిండు జీవితం గడిపి,70 సంవత్సరాల వైవాహిక జీవితం గడిపి, జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ధీశాలి. నెమ్మదిగా ఆ భావోద్రేకం నుంచి బయటపడి, వెళ్ళడానికి తగు ఏర్పాట్లకోసం చూసి, టిక్కట్లు రిజర్వు చేయించుకోడానికి ప్రయత్నం చేస్తే, ఎక్కడా ఏ రయిలుకూ దొరక్కపోతే, పగలు వెళ్ళే జన్మభూమికి రిజర్వు చేయబోతే, అవి బేంకు దగ్గర పని చెయ్యక రెండు సార్లు డబ్బులు తీసుకోడం జరిగింది కాని, రిజర్వ్ కాలేదు. నిజానికి ఆయన వియ్యంకుడే కాని, బాంధవ్యం తోటి స్నేహం కలసి అది మరింత గట్టిపడిపోయింది. మా మొదటి కలయిక, ఒక వేసవిరోజు మిట్ట మధ్యాహ్నం, ఆక్షణం మొదలు మేము ఇద్దరం బంధువులమో, స్నేహితులమో, మాకే తెలియలేదు. ఆయన ఒక గురువు,స్నేహితుడు, బంధువు,మార్గదర్శి, మా పరిచయమైన మొదలు ఏరోజూ మేము భేదాభిప్రాయం వెలిబుచ్చుకునే సావకాశమే రాలేదు. ఎప్పుడేనా సమస్యవచ్చినా దానిని ఇద్దరం చర్చించుకుని పరిష్కారం కనుగొనేవాళ్ళం. అటువంటివారు లేరన్నమాట నన్ను నివ్వెరపాటుకు గురిచేసింది. మనిషిని ఇక్కడవున్నానుకాని మనసిక్కడలేదు. ఎంత తొందరగా వెళ్ళగలనా అక్కడికి అన్నదే నా అలోచన. అబ్బాయిని రిజర్వేషన్ కి వెళ్ళమని చెబుతుండగా ఒక స్నేహితుడు వస్తూ, “ఏంటి రిజర్వేషన్ అంటున్నారు, ప్రయాణమా” అన్నారు. సంగతి చెప్పేము, “మీరు వెళుతున్నారా” అన్నారు. “అవున”న్నా. “మీరెలా వెళతారు? మన సంప్రదాయం ప్రకారం వియ్యంకుడుపోతే సంవత్సరం పూర్తి అయ్యేదాకా, వియ్యంకుడు వెళ్ళకూడదు,వియ్యపురాలు పోతే వియ్యపురాలు కూడా సంవత్సరం దాకా వారింటికి వెళ్ళకూడదు కదా” అన్నారు. “ఎందుకు వెళ్ళకూడదన్నా, ఏదో వియ్యంకుడి జీడి,వియ్యపురాలి జీడి అంటారు, వెళితే, ఈ వెళ్ళినవారు కూడా గతిస్తారంటారు,” అన్నాడు. సందేహం వెలిబుచ్చారు, అప్పటికి రిజర్వేషన్ వాయిదా వేశాం, ఆయన తృప్తి కోసం. వారు వెళ్ళిన తరవాత మరల విషయం చర్చకు వచ్చింది. సంప్రదాయంగా వియ్యంకుడు పోతే, వియ్యంకుడు సంవత్సరంపాటు వెళ్ళనిమాట నిజమని నాకూ తెలుసు, కాని అది మూఢ నమ్మకమనుకుంటా. “ఏమయినా, ఈ విషయం మీద నీ అభిప్రాయం చెబితే అలాచేస్తాన”న్నా. అందుకు నా ఇల్లాలు, “గత ఏబది సంవత్సరాలుగా నా మనసు మీకు, మీ మనసు నాకు తెలుసు, నేనేమనుకుంటానో మీరే చెప్పండి” అంది. “బలే ధర్మ సంకటంలో పడేసేవని, ఐతే చెబుతున్నా విను,” అని మొదలెట్టా.

“ఇది నిజంగా మూఢ నమ్మకం. మనకు కావలసినవారు కష్టంలో ఉన్నపుడు, అదీ అమ్మాయిని ఇచ్చినచోట కాని, అమ్మాయిని తెచ్చుకున్న చోట కాని ఇటువంటి కష్టం కలిగితే, వెళ్ళి ఓదార్చి రావడం కనీస ధర్మం. అందుచేత వెళ్ళి వద్దాం” “ఇదీ నీమాట” అన్నా. “నా మనసులో మాట సరిగా చెప్పేరు, నిజంగా ఏమయినా అభ్యంతరం ఉంటే అది నాకుండాలి, నాకా భయం లేదు. అదీగాక 70 సంవత్సరాల వైవాహిక జీవితం గడిపి, 86 సంవత్సరాల వయసులో సహచరుణ్ణి కోల్పోయిన వదిన గారిని పలకరించి రావడం మన ధర్మం. అబ్బాయిని పిలిచి రిజర్వేషన్ చెయ్యమనండి ఇద్దరమూ వెళుతున్నాం” అంది. అదండి, అలా నవంబర్ రెండవతేదీని జన్మభూమి కి హైదరబాద్ వెళ్ళి, చిన్నమ్మాయిని చూసి, ఆరోజు రాత్రికి మనవరాళ్ళ కబుర్లతో కాలక్షేపం చేసి, మరురోజు వియ్యాలవారి కుటుంబాన్ని ఓదార్చి, మరునాడు బయలుదేరబోయి, నీలం తుఫానుకు చిక్కిపోయాం.

రచయిత: kastephale

A retired telecom engineer.

46 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మూఢ నమ్మకం.”

  1. మీరు తిరిగి బ్లాగులోకి రావడం సంతోషంగా వుంది శర్మ గారూ. మళ్ళా కళ వచ్చింది ☺.

    మూఢ నమ్మకాల్ని పట్టుకు వేళ్ళాడుతూ కొన్ని కనీసధర్మాల్ని కూడా నెరవేర్చని వ్యక్తులు అక్కడక్కడ తగులుతూనే వుంటారు. మీరిద్దరూ ఆ కోవకు చెందరు 👏.

    మీకు, మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభకామనలు🌷. కొత్త సంవత్సరం మీకందరికీ ఆరోగ్యదాయకం గానూ, మరింత ఆనందకరంగానూ వుండాలని అభిలషిస్తున్నాను.

    మెచ్చుకోండి

      1. Zilebiజిలేబిగారు,
        మీకున్నూ ఆంగ్ల నూతన వత్సర శుభకామనలు.

        నేను బ్లాగులోకి రాని కాలంలో చాలాచాలా జరిగిపోయాయట 🙂

        తమరు తెలుగు మహా సభలకి రావడానికి చెన్నై లో దిగేరట, అయ్యరుగారింటికెళ్ళి అక్కడినుంచి రైల్లో హైదరాబాద్ చేరారట. మధ్యలో ఒంగోల్ లో బండి ఆగిపోతే దిగి రైల్వే వాళ్ళని గలాటా చేసేరట! హైదరాబాద్ లో నానక్ రాం గూడా సాయిబాబా ఆలయం పక్క మకాంట. అరవ ఏసలో తెలుగు పజ్జాలు, పైకూలు,పికూలు చెబుతూ తెలుగు సభల చుట్టూ తిరుగుతుంటే అష్టావధానానికి లోపలికి తోసుకు పోబోతే ఆపేసారట. ఎక్కడనుంచని అడిగితే గోజిల వాళ్ళం అని చెప్పబోయి నాలిక కరుచుకుని తమిల్ అని చెప్పుకుంటే ఒకరెవరో ”ఈ అరవ పాటీని తొక్కి చంపేస్తార్రా, జనం! లోపలికి పంపేయండంటే” ఎవరో తీసుకుపోయి కుళ్ళు గుమ్మిడికాయని కుదేసినట్టు కుర్చీలో కుదేస్తే అష్టావధానంలో, అప్రస్థుత ప్రసంగం చేస్తానన్నారట. చివరాఖరికి అష్టావధానిగారిని సన్మానం చేసేరట. తమరికి అరవ పాటీ బిరుదు ప్రదానం చేసేరట!

        ఆ తరవాత వేంకన్న బాబుని చూద్దామని బయలు దేరి అలిపిరిలో నారాయణా అనబోతే చాల్లేవమ్మా! అని సన్మానం చేయబోయారట! ఒకటో తారీకున తిరిగెళ్ళడానికి మీనంబాక్కం లో తోపులాట జరిగిందిట, యువతులతో నారాయణా అంటే ఊరుకుంటారా! తోపులాటతో కింద పడ్డారట 🙂 ప్లేన్ ఎక్కేందుకూ తోపులాటే 🙂 అక్కడా దెబ్బలాటే 🙂 పుఱ్ఱెతో పుట్టిన బుద్ధికదూ! చివరికి ఇంటికి చేరేరట…. ఇలా సభలు సమావేశాలని నన్ను తిప్పి చంపకని అయ్యరుగారు కోపగించారట! 🙂 రెండు గంటల విమాన ప్రయాణానికి ఇంత తలనొప్పెందుకండీ 🙂 పెద్దలు కూడా కెలుకుడు ఆపు తల్లీ అని బతిమాలుకుంటున్నారట 🙂

        ఏంటో! అంతా విష్ణుమాయ నారాయణ
        ధన్యవాదాలు.

        మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

    1. విన్నకోట నరసింహారావుగారు
      నూతన వత్సరం మీకు,మీకుటుంబానికి సర్వ శుభాలు అందించాలని కోరుకుంటున్నాం.

      మీ పలుకు అమృతపు చిలుకై మాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది.
      ధన్యవాదాలు.

      మెచ్చుకోండి

      1. మీరు నిజ్జంగానే షెర్లాక్ హోమ్సండీ !!!!
        ಬೆಂಗಳೂರು ಮಹಾನಗರ వదిలేసారు 🙂

        మీ పలుకులు అమృతపు చిలుకులై మాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది.

        ధన్యవాదాలు

        జిలేబి

        మెచ్చుకోండి

    1. YVR’s అం’తరంగం’గారు,
      పెద్దలంతా ఒకలా ఆలోచిస్తారనో, పెద్దల ఆలోచన లన్నీ ఒకలా ఉంటాయనో ఒక తెల్లోడి సామెతట కదా 🙂
      ధన్యవాదాలు.

      మెచ్చుకోండి

    1. ఫణీన్ద్ర పురాణపణ్డగారు,

      ఈ కామెంట్ స్పాం ల కెళిపోయిందెందు చేతనో, అక్కడ వెతికితే దొరికింది.
      ధన్యవాదాలు.

      మెచ్చుకోండి

    1. రమణాజీ,

      నూతన వత్సర శుభకామనలు.

      ఇల్లాలి అనారోగ్యంతో, ఆమెను కనిపెట్టుకుని ఉండిపోయి, బ్లాగుల్లోకి రాలేదు.
      ధన్యవాదాలు.

      మెచ్చుకోండి

  2. ”ఫణీన్ద్ర పురాణపణ్డ commented on శర్మ కాలక్షేపంకబుర్లు-మూఢ నమ్మకం.

    Posted on నవంబర్ 8, 2012 21 మూఢ నమ్మకం. నవంబర్ 20 ఉదయమే పూజ, …

    గురువు గారూ… బహుకాల దర్శనం. (పునః ప్రచురణ రూపంలోనైనా.) చాలా సంతోషం.
    ఆరోగ్యం జాగ్రత్త.”

    ఫణీంద్ర గారు,

    మీ కామెంట్ ఎందుకో బ్లాగులోకి రాలేదు,మెయిల్ కి వచ్చింది, వెతికాను, బ్లాగులో కనపడలేదు.

    నూతన వత్సర శుభకామనలు.

    ఆమె ఆరోగ్యం తరవాతే ఏదైనా
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  3. పోరీ! మాచన వర్యుల్
    ధారాళమ్ముగను కథల దట్టించిరిగా !
    ప్యారీ జిలేబి ! నీయై
    పీ రాదారులట కోడి పీకయ్యెనుబో 🙂

    జిలేబి

    మెచ్చుకోండి

    1. జిలేబిగారు,

      మాకొచ్చిన వార్త ఇది. వచ్చాను రాలేదు చెప్పలేదే? 🙂

      అన్నట్టు మద్రాసులో పడినప్పుడు మోకాలు వాచిందిగా,అయ్యరుగారు వేణ్ణీళ్ళ కాపడం పెడుతున్నారా? ఇదేనా చెప్పండి 🙂

      మీరు ఫ్లైట్ దిగి జియో సిమ్ కొన్న దగ్గరనుంచి, కుంటుకుంటూ ఫ్లైట్ ఎక్కేదాకా… 🙂

      మరిచానండోయ్! మీ పికూలు, పైకూలకేంగాని మీ పద్యాలు కూడా రేడియోలో చదివారటగా, ఇదేనా చెప్పండి.

      కెలుకుళ్ళాపు తల్లీ అని తమరిని వేడుకున్నదేనా చెప్పండి 🙂
      ధన్యవాదాలు.

      మెచ్చుకోండి

      1. Zilebiగారు,

        మోకాలు నెప్పి తగ్గిందా! అయ్యరుగారు కాపడాలెట్టేరుగా! తగ్గిపోతుంది.
        ఇలా పిల్లలతో పోట్లాడితే ఇలాగే అవుతుంది. దెబ్బలాడకండి 🙂
        దెబ్బలాటలో మీరు సాధించేది శూన్యం! 🙂
        ధన్యవాదాలు.

        మెచ్చుకోండి

  4. “జిలేబి” గారి ప్రయాణ విశేషాల వర్ణన బాగుంది శర్మ గారూ ☺. అయితే //” తమరు …. చెన్నై లో దిగేరట, అయ్యరుగారింటికెళ్ళి అక్కడినుంచి రైల్లో హైదరాబాద్ చేరారట. “// అన్నారు మీరు. అంటే వీరిద్దరూ వేర్వేరు ఊళ్ళల్లో నివాసమాండీ? ☺

    మెచ్చుకోండి

    1. విన్నకోట నరసింహారావుగారు,

      అమ్మవారు తెలుగు సభలకి వచ్చారండి, ఇది నిజం, దేశంలో పదిరోజులున్నారు. మూడురోజులు సభలు,రెండు రోజులు పెరుమాళ్ళ దర్శనం మూడు రోజులు కన్నడ మాడి బెంగులూరు, అదండి కత షేర్లాక్ హోమ్స్ కాదండి శర్మాస్ హోమ్స్. 🙂

      అయ్యరుగారిది మద్రాసు,తేనాం పేట, స్వంత ఇల్లు ఉంది.ఆ ఇంటికెళ్ళేరనమాట.

      అయ్యరుగారు అమ్మవారితో కలిసేవచ్చారు, ఒక్కరూ ప్రయాణం చెయ్యరు, లగేజి ఎవరు మోస్తారు? అందుకు అయ్యరువారు కూడా ఉండాల్సిందే 🙂

      ఇప్పటికీ అయ్యరుగారి ఇల్లనే అంటారు అమ్మవారు 🙂
      ధన్యవాదాలు.

      మెచ్చుకోండి

      1. హైద్రబాదు వచ్చి , రైనను మాకెట్టి
        కబురు లేదు , హితులు గామ మేము ?
        తగమ యించుకైన తవరి యంతస్తుకు ?
        కన్నులార గాంచు కాంక్ష దొరగె !

        మెచ్చుకోండి

      2. వెంకట రాజారావు . లక్కాకులగారు,

        హైదరాబాద్ వచ్చారు, ఎవరికీ చెప్పలేదు.
        మీది మరీ చాదస్తం సార్! అక్కడ సభలో శంకరయ్య గారిని కలిసేరు, వారికే చెప్పలేదు తమరెవరో!
        రేడియోలో చెప్పించుకున్నారుట పేరు! పద్యం రాశార్ట! అదండీ, మనమెలా కావలసినవాళ్ళమవుతాం సార్!
        నారాయణ! నారాయణ!!
        ధన్యవాదాలు.

        మెచ్చుకోండి

  5. ఎంచగ ‘ పద్దెనిమిది ‘ సము
    దంచిదముగ మేలు సేయు తమ రిరువురికిన్
    మించుగ నారోగ్యములును
    సంచిత శుభములు కలుగును శర్మ మహాత్మా !

    మెచ్చుకోండి

    1. వెంకట రాజారావు . లక్కాకుల గారు,

      విషయం పూర్తిగా అవగాహన కాలేదు.
      మీ పలుకులు అమృతపు చినుకులు. మాలో ఆత్మ విశ్వాసం బాగా పెరిగింది.
      ధన్యవాదాలు.

      మెచ్చుకోండి

      1. పదునెనిమిదిలో యేదో
        ‘అది ‘ దా గున్నదటవే! సయాటల రమణీ
        విదురులు రాజా వారల్
        కుదురుగ చెప్పిరట చూడు కుసుమకుమారీ 🙂

        జిలేబి

        మెచ్చుకోండి

  6. కుసుమ కుమారికి ‘కంద’ ము
    రసనాగ్రంబందు జేరె , రాత్రిం దివముల్
    ‘నస’ పోదు , భజన కొలువుల
    కసటులు ప్రియమార మదికి ఘనమనిపించున్ .

    మెచ్చుకోండి

    1. జిలేబి వరుసల్ భళిభళి చిత్రకందమై
      భళీ యనెనహో కవివర ! పద్యమైయిటన్
      మలాయి పలుకుల్ మదిమది మానసమ్మునన్
      సలాము లనెగా నెలతుక చక్కనేర్వగన్!

      జిలేబి

      మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

      1. పుంఖానుపుంఖములుగా
        పంఖా ద్రిప్పగ పదములు ,పద్యము లగుచున్
        సంఖతమయె! వాసి గనక
        కంఖాణపు పరుగులయ్యె కంద జిలేబీ 🙂

        జిలేబి

        మెచ్చుకోండి

      2. “జిలేబి గారు,

        పలుగు రాళ్ళలాటి పదాలతో పద్యాలు పూర్తికావచ్చుగాని వాటికి అందం ఉండదు,ఆకారం మాత్రం ఉంటుంది. లలితమైన పదాల కోసం ’నారాయణీయం’ పర్యాయపద నిఘంటువు దొరుకుతుందేమో చూడండి. మామూలు నిఘంటువులతో మీకు పని పూర్తయింది,ముందుకు నడవండి, మారండి.
        ఏనుగు= కరి,హస్తి,ద్విరదము,దంతావళము,మత్తేభము……
        లే……దూ
        బాధలేదు, పోతన భాగవతం చదవండి! మీకు కావలసిన అన్ని పదాలు,కావలసినన్ని పదాలూ,లలితంగా,సుందరంగా మీ ముందు నాట్యం చేస్తాయి. మీరు మారరులెండి 🙂 .”
        మారద్దు సుమా, మీరు మారితే ప్రమాదం,ప్రమోదం కాదు 🙂
        ధన్యవాదాలు.

        మెచ్చుకోండి

      3. మనమది లో భావమ్ములు
        మన రీతిగ వెలుగవలెను మహిని జిలేబీ !
        తనదైన శైలి గని పో
        తన, శ్రీనాథుని,మనలను తరియించె నహో!

        జిలేబి

        మెచ్చుకోండి

      4. నిఘంటువును చూడక మది నెమ్మదిన్ గనం
        గ ఘంటమున జేర్చ వలయు కంద పద్యమున్
        పొగాకువలె ఘాటువలదు పూవుబోడియా
        జిగేలు మనిపించవలెను చిత్రపద్యముల్ !

        జిలేబి

        మెచ్చుకోండి

      5. Zilebi
        నిఘంటువు చూసి పద్యాలు రాయండి, పద్యం చదువుకుంటే ఉన్నమతిపోవాలి అలా ఉండాలి పద్యమంటే 🙂
        అలాగే రాయండి.భావానికేంలెండి. మీ భావమేంటో మీకునా తెలిస్తే అదే పదివేలు. 🙂
        ధన్యవాదాలు.

        మెచ్చుకోండి

    2. వెంకట రాజారావు . లక్కాకుల గారు,
      జిలేబి కందం కట్టడం నేర్చారు సరే! అర్ధానికి నిఘంటువులు చూసుకోవాలంటే వారే చదువుకోవాలి 🙂

      ధన్యవాదాలు.

      మెచ్చుకోండి

  7. //” పుంఖానుపుంఖాలుగా రాస్తుంటే,బాగుందనక ఏం చేస్తాం 🙂 jk”//

    బ.బ్రా ?? ☺

    మెచ్చుకోండి

  8. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తెలుగు సభలకు ఆహ్వానితుడుగా హాజరైన అమెరికావాసి వంగూరి చిట్టెన్ రాజు గారు తన అనుభవాల్ని “కౌముది” వెబ్ మాసపత్రిక జనవరి 2018 సంచికలో వ్రాసారు . ఈ క్రింది లింక్‌లో చదవచ్చు.

    Click to access jan_2018_amerikulasakathalu.pdf

    అలాగే “జిలేబి” గారు కూడా ఆ సభలకు వెళ్ళారని అభిజ్ఞవర్గాలు అంటున్నారు కదా. మరి “జిలేబి” గారు కూడా తన అనుభవాల గురించి తన బ్లాగ్‌లో ఓ పోస్ట్ వ్రాయచ్చుగా? చదివి ఆనందిస్తాం

    మెచ్చుకోండి

    1. విన్నకోట నరసింహారావుగారు,
      మంచి లింకిచ్చారు,చదువుతాను. వచ్చినట్టే చెప్పనివారు, అనుభవాలు చెప్పడమా! భలేవారే 🙂
      ధన్యవాదాలు.

      మెచ్చుకోండి

    2. విన్న కోట వారు

      ఆ హెడింగ్ మొదటే నేను చెప్పేసా కామింట్లో 🙂 మహా సభల సమయం లోనే సత్తే పే సత్తా సభలోనే అదిన్నూ శ్రీ మాన్ అయ్యరు గారి పక్కన కూర్చొనే 🙂

      మీరు గుర్తించారు కూడా 🙂

      ఆ ఒక్క ‘పలుకు’ చాలదా జిలేబి సమీక్ష 🙂

      చీర్స్
      జిలేబి

      మెచ్చుకోండి

      1. “జిలేబి” ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే అంటారా మీ తమిళ “తలైవా” లాగా ☺? అలాక్కానివ్వండి “జిలేబి” గారూ ✋.

        మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.